బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే అమాద్మి పార్టీ ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి, విద్యాశాఖ మంత్రి మనీషా సిసోడియా ను అరెస్ట్ అని అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మూర్తి ఆరోపించారు. ఈ అరెస్ట్ పై సోమవారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్య మంత్రి అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. నీటి నిజాయితీ మరియు స్వచ్ఛమైన పాలనకు నిదర్శనం అమాద్మి పార్టీ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారం కోసం ఇతర పార్టీ లను ప్రజల్లో పలచన చేయడానికి సిబిఐ, ఈడి, ఏసిబి తదితర వ్యవస్థలను అడ్డం పెట్టుకొని భయబ్రాంతులకు గురించేస్తు వారి ఎదుగుదల అడ్డుకోవడం కోసం కేసులు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు సాగిన, పేదలకు సహాయ సహకారాలు అందించిన, విద్యార్థులు భవిష్యత్ కోసం పనిచేస్తున్న మంత్రి ని అరెస్ట్ చేయడం శోచనియమన్నారు. దేశంలో బీజేపీ వైఖరికి అరెస్ట్ లే అద్దం పడుతున్నాయని, రానున్న రోజుల్లో ఓటు తో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.