ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో నడిరోడ్డులోనే ఓ మహిళ కొందరు యువకులను చితక్కొట్టింది. ఓ ముస్లిం మహిళ తన భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా అటుగా వెళ్తున్న పోకిరీలు ఆమెను వేధించారు. ప్రశ్నించిన భర్తపై వారు దాడికి దిగగా, ఆ మహిళ రంగంలోకి దిగింది. చెప్పు తీసుకుని యువకులను చితక్కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.