చీరాల మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ మొగిలి దీపిక మంగళవారం చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం పక్షంలో చేరారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఆమె చీరాల మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్. పానెల్లో ఇండిపెండెంట్ గా నిలబడి విజయం సాధించారు. అయితే వార్డు అభివృద్ధిని కాంక్షించి ఎమ్మెల్యే కరణం బలరాం, నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా మొగిలి దీపిక చెప్పారు. మొగిలి దీపిక, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ మొగిలి బాబ్జీలను ఎమ్మెల్యే కరణం బలరాం సాదరంగా ఆహ్వానించారు. కలిసి పనిచేసి వెనకబడిన ఒకటో వార్డును అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఆయన వారికి సూచించారు. ఆ వార్డ్ నాయకులు దాసరి శ్రీకాంత్, మల్లి నవీన్, నల్లగండ్ల ప్రభాకర్ రావు, మొగిలి శ్రీనివాసరావు, మొగిలి జయ, కొండ్రగుంట ఈశ్వర్ , దుడ్డు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.