ఒంగోలు నగరంలోని స్థానిక భాగ్యనగర్ రెండో లైన్ లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొత్త వెంకటసుబ్బయ్య కుమారుడు గుత్తా వాసు బాబు నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఒంగోలునగరంలోని భాగ్యనగర్ లో గల వాసు బాబు నివాసంలో, టంగుటూరులోని వారి కుటుంబ సభ్యుల నివాసులను ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఐటి అధికారులు నివాసాల్లోనే అన్ని కాగితాలను పూర్తిగా పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఐటీ దాడుల్లో విజయవాడ అధికారులు మరియు పోలీస్ అధికారులు కూడా ఉండటం విశేషం. పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది.