క్యాలీఫ్లవర్ జాతికి చెందిన బ్రొకోలీ మంచి లాభదాయకమైన పంట. సాగుకు ముందడుగు వేసే రైతులు మార్కెట్లో అందుబాటులో ఉన్న సీడ్ తీసుకొని, స్థానిక నర్సరీల్లో ప్యాకెట్లలో విత్తుకోవాలి. ఎకరాకు 15 వేల నుంచి 16వేల వరకు మొక్కలు నాటుకోవాలి. అధిక దిగుబడి ఆశించే రైతులు భూమిలో బోదెలు చేసి, మల్చింగ్ పద్ధతిలో మొక్కలను నాటుకోవాలి. బ్రొకోలీ 90-100 రోజుల పంట. మొక్క నాటిన 50 నుంచి 70 రోజుల్లోనే దిగుబడి మొదలవుతుంది.