పెరుగు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే పెరుగును రాత్రి పూట తినడం కంటే మధ్యాహ్నం తినడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట పెరుగు తింటే పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తింటే మంచిది కాదు. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదట.