గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం లో చైర్ పర్సన్ ఎన్. భవాని అధ్యక్ష తన మంగళవారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని పాలక వర్గం ప్రారంభించిన 15 నిమిషాల్లోనే ముగించి మమ అనిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్ననందున అజెండాలో కేవలం 7 అంశాలనే పెట్టారు. దీంతో సమావేశం ప్రారంభం అయిన 15 నిమిషాలులోపే అధికార పార్టీ మెజారిటీ కౌన్సిలర్లు అజెండా లో అంశాలకు ఆమోదం చెప్పడంతో సమావేశం ముగిస్తున్నట్లు చైర్ పర్సన్ చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్ బండి శేషన్న, వైకాపా, టిడిపి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.