ముదిగుబ్బ మండల పరిధిలోని దొరిగల్లు గ్రామ రైతులు ముదిగుబ్బ సబ్ స్టేషన్‌ను మంగళవారం ముట్టడించారు. కార్యాలయానికి తలుపులు వేసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయామని ఈ రబీ సీజన్లో అయినా పంటలు పండిద్దామంటే విద్యుత్ సమస్యలు అధికమయ్యాయయని వాపోయారు. లో వోల్టేజ్, మరమ్మతులు, సాంకేతిక లోపాలు అంటూ విద్యుత్ అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వోల్టేజ్ సమస్య వల్లే తరచూ స్టార్టర్లు, మోటర్లు మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ చేశారు. ఈ విషయంపై కదిరి ఈస్ట్ ఎడి ఆనంద్ మాట్లాడుతూ ఓవర్ లోడ్ సమస్యలు తలెత్తుతున్నాయని లోడ్ డైవర్ట్ పద్ధతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.