మంగళగిరి పట్టణంలోని నృసింహుని మాల ధరించిన వారి పట్ల దేవస్థాన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సుమారు 600 మంది నృసింహుని మాల ధరించిన వారిలో ఉన్నారు. అయితే బ్రహ్మోత్సవాల కీలక ఘట్టమైన స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాల ధరించిన మహిళలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు మహిళా భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మాల ధరించిన వారికి ప్రత్యేక దర్శన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొంటూ బ్రహోత్సవాల ఆహ్వాన పత్రికలోనూ ప్రచురించలేదని ఇదేనా తమకిచ్చే ప్రాధాన్యత అని ప్రశ్నిస్తున్నారు. రధోత్సవం అనంతరం గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉండగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని ఆయా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదని భక్తుల సమ్యల పరిష్కారానికి ఈఓ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.