నాగార్జునసాగర్ జలాశయంలో నీటిలభ్యత తగ్గిపోతుండటంతో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందించడానికి జలవనరులశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పంటలన్నీ కీలక దశలో ఉండటంతో ఒక్క తడి తగ్గినా దిగుబడులపై ప్రభావం పడి రైతులు నష్టపోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకుంటూ ఏప్రిల్ నెలలోనూ నీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకు వారబందీ ప్రణాళిక సిద్ధం చేసి ఈనెల 6 నుంచి అమలుచేయనున్నారు. ఆరు రోజులపాటు కాలువకు నీటి విడుదల నిలిపివేయడం, 9 రోజులు నీటిని విడుదల చేసి వాడుకుంటారు. ఆరు రోజుల పాటు నీటి విడుదల నిలిపివేయడం వల్ల పొదుపు చేసిన నీటితో ఏప్రిల్ నెలలోనూ సాగునీరు ఇవ్వాలనేది ప్రణాళిక. జలాశయంలో నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంది