అందరికీ అందుబాటులో ఉంటూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కలువాయిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ త్వరలో గడప గడపకు కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, జడ్పీటీసీ బి.అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ ఆర్.లక్ష్మీదేవి, నాయకులు మాదాసు యజ్ఞపవన్, చల్లా రఘరామిరెడ్డి, మేకపాటి వెంకటనరసారెడ్డి, చల్లా శ్రీనివాసులరెడ్డి, మాకిరెడ్డి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.