యూఎస్ లో షిగెల్లా బ్యాక్టీరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూఎస్ అధికారులు దీనిని "తీవ్రమైన ప్రజారోగ్య ముప్పు"గా పేర్కొన్నారు. ఇది ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఇది షిగెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా, లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.