అనుమతులు లేకుండా అక్రమంగా ఏడు ట్రాక్టర్లతో తరలిస్తున్న ఇసుకను బొండపల్లి మండలంలోని నెలివాడ జంక్షన్ సమీపంలో పట్టుకున్నామని ఎస్. ఐ ఎస్. రవి చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గజపతినగరం మండలం మీదుగా జాతీయ రహదారి 26పై గురువారం సాయంత్రం ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా అడ్డుకొని స్టేషన్ కు తరలించి సీజ్ చేశామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించామని తెలిపారు.