నెల్లూరు జిల్లా, చేజర్ల మండలంలోని ఆదురుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిత్తలూరుకి చెందిన ఇషిత రెండు రోజుల క్రితం జ్వరంతో మృతి చెందింది. దీంతో శుక్రవారం ఆత్మకూరు ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటప్రసాద్ గ్రామంలో విచారణ చేపట్టారు. బాలిక ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు మన దరికి చేరవన్నారు. అలాగే జ్వరం ఉన్నప్పుడు సమీపంలోని ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు.