నెల్లూరు జిల్లా, సంగం మండలంలోని పెరమనలో వీధి కుక్కలు దాడిచేయడంతో వన్నె ధర్మయ్యకి చెందిన 15 మేకపిల్లలు చనిపోయాయి. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.... , గ్రామానికి చెందిన ధర్మయ్య మేకలు మేపుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని మేకలు ఈనాయి. మేకలను సమీపంలోని దొడ్డిలో ఉంచి, చిన్న పిల్లలను తన ఇంటి పక్కన రేకుల షెడ్లో ఉంచాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున వీధికుక్కలు మేకపిల్లలపై దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో 15 పిల్లలు చనిపోగా, మూడు పిల్లలు తప్పించుకున్నాయి. దీంతో సుమారు లక్ష మేర నష్టం వాటిల్లిందని బాధితుడు లబోదిబోమంటున్నారు.