సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. తెనాలికి చెందిన నెలకుర్తి త్రివేణి అనే మహిళ సైబర్ మోసం బారిన పడి రూ4.75 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా మోసగాళ్లు కొట్టేసిన డబ్బులో రూ.2.55 లక్షలు తిరిగి ఆమె ఖాతాకు రప్పించగలిగారు. ఈ మేరకు శుక్రవారం త్రివేణి జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... ఎవరైనా సైబర్ క్రైం బారిన పడినట్లయితే 1930 నెంబర్‌కి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ కె.సుప్రజ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరసింహారావు, ఐటీ కోర్ ఇనచార్జి ఎస్‌ఐ దండా వెంకట కృష్ణ, ఐటీ కోర్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.