రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం ఖాయమని, ప్రజల స్పందన కూడా ఊహించని రీతిలో ఉందని, రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఒక్కసారి జగనకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తన నివాసంలో శుక్రవారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో భాగంగా 22, 26, 30, 31 వార్డులకు సంబందించిన ప్రెసిడెంట్, సెక్రటరీలు, బూత కన్వీనర్లు పాల్గొన్న ఈ సమావేశంలో వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.... పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల పై పార్టీ శ్రేణులకు దిశ, నిర్దేశం చేశారు.