గుత్తి పట్టణ శివారులోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు డీజల్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణానికి చెందిన నరేంద్ర ఆచారి (28)అనంతపురము నుంచి గుత్తికి ఆటోలో వస్తుండగా గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపం లో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరేంద్ర ఆచారికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్ర లను వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సలు అనంతరం నరేంద్ర ఆచారి ని మెరుగైన వైద్యం కోసం అనంతపు రానికి తరలిస్తుండగా మార్గమధ్యం లో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.