తెనాలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత ప్రభుత్వంలో వివేకానందరెడ్డి హత్య జరిగిందని, దానిని టీడీపీపై రుద్దాలన్న తాపత్రయంతో వారి సొంత మీడియాలో సైతం నారాసురర్త చరిత్ర అని బ్యానర్ పెట్టి టీడీపీపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపారని ఆరోపించారు. ప్రస్తుతం కేసు వేగం పుంజుకుని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో ఆయన సన్నిహితుల పాత్ర పెద్దగా వినిపిస్తుందని ఇది వైసీపీ కల్పించిన నారాసుర రక్త చరిత్ర కాదని జగనాసుర రక్త చరిత్ర అని చెప్పారు. హత్య కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలను జగన్ సొంత మీడియాలో ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. హత్య జరిగిన తీరు ప్రజలు తెలుసుకున్నారని సొంత బాబాయ్‌ని కూడా ఎన్నికల్లో గెలుపొందేందుకు పావుగా వాడుకున్న పార్టీ వైసీపీనేనని, ప్రజలు ఇప్పటికైనా జగన్ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో పాత్రదారులను న్యాయస్థానం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.