ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వివాదాస్పద నిత్యానంద శిష్యులు కైలాస దేశం ప్రతినిధులు హాజరుకావడం.. దీనిపై ఐరాస వివరణ ఇవ్వడం తెలిసిందే. తాజాగా, ఐరాస మానవహక్కుల కమిషన్ కైలాస ప్రతినిధుల హాజరుపై మరో కీలక ప్రకటన చేసింది.‘యునైటెడ్ స్టేట్స్ ఆప్ కైలాస’ ప్రతినిధులు చేసిన సూచనలను ఆఫీస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ హైకమిషన్ ఫర్ హ్యుమన్ రైట్స్ (OHCHR) కొట్టిపారేసింది. వారు చేసిన సూచనలు అసంబద్ధమైనవని, తుది ముసాయిదాలో వాటిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టంచేసింది.
తాము నిర్వహించిన రెండు బహిరంగ సమావేశాల్లో కైలాస దేశం ప్రతినిధులు పాల్గొన్నట్లు ఓసీహెచ్‌సీఆర్ అంగీకరించింది. ప్రచార సామాగ్రి పంపిణీ చేయకుండా వారిని అడ్డుకున్నట్లు తెలిపింది. కైలాస తరఫున ప్రతినిధిగా హాజరైన విజయప్రియ నిత్యానంద మాట్లాడటం సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఓహెచ్‌సీహెచ్‌ఆర్ ప్రతినిధి స్పందించారు. ఫిబ్రవరి 22, 24 తేదీల్లో జరిగిన ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, సాధారణ ప్రజలను అనుమతించామని తెలిపారు. మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీకి వారు ఇచ్చిన రాతపూర్వక అభిప్రాయానికి, సాధారణ చర్చకు సంబంధం లేదు కాబట్టి వాటిని ప్రచురించబోమని పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి అంశంపై ఫిబ్రవరి 24న జరిగిన సమావేశానికి కూడా వారు హాజరయ్యారని చెప్పారు.
ఈ సాధారణ చర్చలకు ఆసక్తి ఉన్న ఎవరికైనా హాజరుకావచ్చని ఈ కమిటీలను పర్యవేక్షిస్తున్న ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయంలోని మీడియా అధికారి వివియన్ క్వాక్ అన్నారు. కైలాస దేశం రాతపూర్వక ఫిర్యాదు సాధారణ చర్చకు సంబంధించిన అంశానికి సంబంధం లేనిది కాబట్టి నివేదికలో చేర్చబడదని క్వాక్ చెప్పారు. రెండో చర్చలో కైలాస ప్రతినిధి చేసిన ప్రతిపాదనకు, ఐరాస చేపట్టిన అంశానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు.
ఈ ఉదంతంపై సమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ ఉదంతంపై ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa