అల్లూరి సీతారామరాజు జిల్లాలో శిశు మరణాలు ఆగడం లేదు. శిశు మరణాలకు అధికారుల నిర్లక్ష్య ధోరణిననే అంటున్నారు మన్యం గిరిజనులు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయితి పరిధి శిరసాగుడ గ్రామానికి చెందిన కొర్ర. సుందర్రావు సుమిత్ర దంపతులకు జన్మించిన 4 నెలల పసికందు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచింది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అల్లూరి జిల్లా మన్యంలో శిశు మరణాలు అరికట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa