పాలకొండ: ఉత్తరాంధ్రా పట్టుభధ్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్ధి డా. కొరాడ్ల రమాప్రభ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ 250 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, ప్రజాసంఘాల కలిపి అభ్యర్ధిగా ప్రకటించారన్నారు. ఉత్తరాంధ్రా అభివృద్ది పై గుంతుకు విప్పడానికి, మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల సాధనకై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రా లో విద్య, ఉపాధి, వ్యవసాయంలో, వైద్యం లో వెనకబడి ఉండటంతో ప్రాంతం వెనకబడి ఉందన్నారు. గిరిజన యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, రైల్వే జోన్, వంటి సాధనకు కృషి చేస్తునన్నారు. జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజ సంఘాల నాయకులు తిరుపతి రావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు.