ఎక్కువ మోతాదులో నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవగానే కనీసం రెండు గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల శరీరంలో వ్యర్థపదార్థాలు బయటకు వచ్చేస్తాయి. అలాగే భోజనం చేసే అరగంట ముందు, భోజనం అయ్యాక గంట తర్వాత మాత్రమే నీటిని తాగాలి. మహిళలు ప్రతి రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే.. పురుషులు రోజుకి 3 నుంచి 5 లీటర్లు తాగాలి.