దేవాలయానికి వెళ్లిన భక్తుల్లో కొందరు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే సాష్టాంగ నమస్కారం ధ్వజ స్తంభం దగ్గరే చేయాలనే నియమం ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. సాష్టాంగ నమస్కారం ధ్వజ స్తంభం దగ్గర చేయడం వల్ల ఆ నమస్కారం తప్పకుండా ప్రధాన దైవానికి చేరుతుందట. అంతే కాకుండా సాష్టాంగ నమస్కారం కోసం బోర్లా పడుకున్నప్పుడు కాళ్ల భాగం దిశలో ఎలాంటి దేవతా మూర్తులు ఉండవు.