పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని బిండోల్ గ్రామస్తులకు శుక్రవారం వెండి నాణేలు దొరికాయి. 19వ శతాబ్దం మధ్యకాలం నాటి వెండి నాణేలతో కూడిన ఒక గిన్నె అక్కడ త్రవ్వకాల్లో బయటపడింది. బ్రిడ్జి నిర్మాణం కోసం అక్కడ త్రవ్వకాలు జరుగుతున్నాయి. వెండి నాణేలు దొరుకుతుండడంతో స్థానికులు వచ్చి నాణేలను ఎత్తుకెళ్లారు. తాము అక్కడ 1816, 1862, 1877 ఏళ్ల నాటి 3 నాణేలను సేకరించామని అధికారులు తెలిపారు.