దానిమ్మ సాగు చేయడం వల్ల నెలకు రూ.30 వేలు పైనే సంపాదించవచ్చని వ్యయసాయాధికారులు చెబుతున్నారు. దానిమ్మ మొక్కలు నాటిన తరువాత 2 సంవత్సరాలు కష్టపడితే 20 సంవత్సరాల పాటు దిగుబడినిస్తున్నాయి. నాలుగైదు సంవత్సరాల వరకు ఎకరాకు 2 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది. ఆ తరువాత ఎకరాకు 6 నుంచి 8 టన్నుల దిగుబడినిస్తుంది. ఎకరాకు 6 నుంచి 8 టన్నుల దిగుబడి రావడంతో ఖర్చులు పోను రైతులు ఎకరాకు రూ.6 లక్షలు ఆర్జిస్తున్నారు.