ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ గురుకుల పాఠశాలలో 630 మంది విద్యార్థులు ఒకే గోడౌన్‌లో మగ్గుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో భవన నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. 630 మంది విద్యార్థులకు 4 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని వాపోయారు.ఈ మేరకు సీఎం జగన్ కి లేఖ రాశారు. నేడు విద్య ప్రచారానికి, ప్రకటనలకే పరిమితమైందా? అని అడిగారు. మీరు, విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చింతలపూడి గురుకుల పాఠశాలను సందర్శించాలని సూచించారు.