రాజస్థాన్‌లో ఓ వింత శిశువు జన్మించింది. రతన్‌గఢ్‌లో 19 ఏళ్ల హజారీ సింగ్ అనే గర్భిణి ప్రసవం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు ఉందని వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమె 2 గుండెలు, 4 చేతులు, 4 కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. అయితే పుట్టిన 20 నిమిషాలకే ఆ పసిబిడ్డ మరణించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగానే ఉందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa