ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు చేయడమేనా ఉద్యోగులు చేసిన నేరమా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 07:57 PM

వైసీపీ మంత్రుల  జీతాల చెల్లింపుపై ఆర్టీఐ  ద్వారా ఏపీ కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ  సమాచారం కోరారు. పద్మశ్రీ లేఖకు ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. నెల మొదటి రోజే ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రభుత్వం  జీతాలు చెల్లిస్తోందని.. మరి ఉద్యోగులు ఏం పాపం చేశారని.. వారికి ఎందుకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు చేయడమేనా ఉద్యోగులు చేసిన నేరమని పద్మశ్రీ ప్రశ్నించారు. మాకు జీతాలు ఇవ్వండి ప్రభో అంటూ ఉద్యోగులు రొడెక్కుతుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com