చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజవర్గంలో 37వ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం వద్ద ముస్లీం ప్రతినిధులతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. బీజేపీ తో పొత్తులో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం లో ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదన్నారు. మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదు అనే లక్ష్యంతో టీడీపీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ముస్లీంలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేసింది టీడీపీ అని గుర్తుచేశారు. మసీదులు, ఈద్గాల అభివృద్దికి నిధులు కేటాయించామన్నారు. షాదిఖానాలు ఏర్పాటు, ఖబర్‌స్తాన్‌లు అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించింది టీడీపీ అని చెప్పుకొచ్చారు. ఇమామ్‌లు, మౌజామ్లకు గౌరవ వేతనం ఇచ్చామని యువనేత అన్నారు.