ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది. సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్ ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేసారు.