టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియతో మాట్లాడుతూ.. విశాఖలో పెద్ద ఎత్తున్న ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగిందని... 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయన్నారు. లీడర్ షిప్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారని అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఏ సమస్య వచ్చినా తీరుస్తామని సీఎం చెప్పారన్నారు. అయితే కడుపు మంటతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బురదజల్లుతోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముందు లోకేష్ ఒక బచ్చా అని వ్యాఖ్యలు చేశారు. ముకేష్ అంబానీ ని విమర్శించే స్థాయి లోకేష్ దా... లోకేష్ స్థాయి ఏంటి అని ప్రశ్నించారు. తెలుగు డ్రామా పార్టీ కొంతమందిని ఏర్పాటు చేసి డ్రామా చేస్తోందని వైసీపీ ఎంపీ యెద్దేవా చేశారు.