గ్యాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నతమైన వ్యక్తిని టీడీపీ నిలబెట్టిందని ఆ పార్టీ నేత కూన రవికుమార్తె లిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం కోసం.. డాక్టర్ వేపాడ చిరంజీవిని పోటీలో పెట్టామన్నారు. మర్డర్‌లు, నేరాలు చేసే వారు పెద్దల సభకు వెళ్తున్నారని... వైసీపీ హయాంలో పెద్దల సభ పరువుతీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏనాడు ఉద్యోగ, ఉపాధ్యాయులను అణిచివేయలేదన్నారు. అరచకాలు సాగిస్తున్న జగన్ చెంప చెల్లుమనాలంటే ఉద్యోగ ఉపాద్యాయులు టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు. జగన్ అహంకారాన్ని అణచివేయడానికి... అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్వేషం, విధ్వంసం ఇదే జగన్ పాలన అని అన్నారు. వైసీపీ రహిత ఏపీని తయారుచేయాలంటే గ్రాడ్యుయేట్, ఉపాద్యాయులు, ఉద్యోగులు విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు. ఓట్లను చీల్చవద్దని.. ఓట్లు చీలడం ద్వారా లక్ష్యం నెరవేరదని తెలిపారు. వ్యక్తులు కాదు ముఖ్యం.. జగన్ అహంకారాన్ని దెబ్బకొట్టడమే ముఖ్యమన్నారు. ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. ఇప్పుడు మోదీ కాళ్ల ముందు ఆంధ్రుల ఆత్మగౌరవంను తాకట్టుపెట్టారని టీడీపీ నేత విరుచుకుపడ్డారు.