ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ హవాలా గ్యాంగ్ ను అదుపులోకి తీసుకొన్న అనంత పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 05:16 PM

పోలీసులు డేగ కన్ను హవాల సొత్తు పట్టించింది. హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్న కేరళ దోపిడీ గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల కల్లుగప్పి హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.89 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఈ డబ్బు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. ఈ డబ్బుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో నలుగురు వ్యక్తులతో పాటు, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


రాప్తాడు హైవేపై ఓ వాహనం వెళ్తుండగా అనంతపురం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు చెక్‌ చేయగా.. షాక్‌‌కు గురయ్యారు. వాహనంలో డబ్బులు కుప్పలుగా ఉండటం చూసి వాహనంలో ఉన్న వారిని ప్రశ్నించడంతో వారు సమాధానం చేప్పడానికి తడపడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డబ్బుపై సరైన ఆధారాలు చూపించాలని కోరాగా.. లేవు అనడంతో అనుమానం మరింత బలపడింది.


దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. కేరళలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వంలో హవాలా చేస్తుండగా ఆ డబ్బును పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa