‘చిత్తూరు వైసీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కల్తీ మద్యం తయారీ, అక్రమ మద్యం సరఫరా కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద బయటికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు’ అని టీడీపీ ఎన్నికల పరిశీలకుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తిరుపతిలో వైసీపీ నాయకులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పెద్దఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించారంటూ జేసీ వెంకటేశ్వర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.