మచిలీపట్నంలో మంగళవారం జరగనున్న జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు చీరాల, పర్చూరు నియోజకవర్గాల నుండి భారీగా జనసైనికులు తరలి రావాలని ఆ పార్టీ నాయకుడు ఆలా వెంకటేశ్వరరావు అలియాస్ శ్రీధర్ కోరారు. జనసైనికుల సౌకర్యార్థం వేటపాలెం మండలం జాండ్రపేట, పందిళ్ళపల్లి, చినగంజాం మండలం కడవకుదురు నుండి బస్సులను కూడా ఏర్పాటు చేశామని ఆయన సోమవారం ఇక్కడ మీడియాకు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి సలుపుతున్నామని ఆయన తెలిపారు. మచిలీపట్నం సభలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసే దిశా నిర్దేశాన్ని బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందన్నారు. జనసేన కార్యకర్తలు తోటరాజా, రామిశెట్టి ఉమా లక్ష్మీనారాయణ పసుపులేటి సాయి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.