ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోటల్ ఇచ్చిన ఆ ఆఫర్ చూసి ఎగబడుతోన్న కస్టమర్లు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 09:36 PM

ఓ రెస్టారెంట్ విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 60కే కోరినంత భోజనం పెడతామని, అయితే దీనికి షరతులు వర్తిస్తాయని మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని కర్నావత్ రెస్టారెంట్. ఎంత తిన్నా ఫరవాలేదు కానీ ఒక్క మెతుకు వదిలేసినా జరిమానా తప్పదని హెచ్చరించింది. అయితే, ఆ జరిమానా కూడా ఎక్కువేం కాదు, కేవలం రూ.50తో సరిపెట్టింది.


ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు లేవని తెగేసి చెప్పింది. ఈ నిబంధనలు అందరికీ స్పష్టంగా కనిపించేలా రెస్టారెంట్ గోడలపై పోస్టర్లను అతికించింది. దీంతో రెస్టారెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రూ. 60లకే అవసరమైనంత ఆహారం దొరకుతుందనే ఆఫర్‌కు జనం ఎగబడతారని రెస్టారెంట్ యాజమాన్యం అంచనా వేసింది. అయితే, కొందరు తాము తినేదాని కంటే ఎక్కువ పెట్టించుకుని చివరకు వృధా చేస్తారని భయపడింది. ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చినదే ఈ జరిమానా ఆలోచన.


ఆహారాన్ని పారబోసే అలవాటు మాన్పించే ఉద్దేశంతోనే జరిమానాలు విధించాలని నిర్ణయించామని రెస్టారెంట్ యజమాని అర్వింద్ సింగ్ కర్నావత్ తెలిపారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ధాన్యాన్ని పండిస్తారని, దీనిని సాధారణ జనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్నదాతల కష్టం వృథా కాకూడదని ఆయన పేర్కొన్నారు. ఇక రోజుకు రెండు పూటలా కడుపు నిండా తిండి దొరకనివారు దేశంలో ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి.. ఆహారం ఎంతో విలువైనదన్న స్పృహ కలిగి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.


సరసమైన ధరకు అపరిమిత ఆహారాన్ని అందించడం ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్నట్టు నమ్ముతున్న అరవింద్.. ప్రజలు దాని ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయకూడదని కోరుకున్నాడు. జరిమానా విధించిన తర్వాత, కస్టమర్లు వదిలిపెట్టిన ఆహారాన్ని పారవేయడం లేదని ఆయన అన్నారు. బదులుగా, అవసరమైన వారికి ఆహారం అందజేయడం జరుగుతోందని అరవింద్ చెప్పారు. ఐకరాజ్యసమితి 2021 డేటా ప్రకారం సగటున దేశంలోని ప్రతి వ్యక్తి 50 కిలోల ఆహారం వృధా అవుతోంది. గతేడాది ప్రపంచ ఆహార సూచిలో భారత్ 107వ ర్యాంకులో ఉంది. మొత్తం 122 దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారు. భారత్ చివరి నుంచి మొదటి వరుసలో నిలిచింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com