ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఇద్దరు వ్యక్తుల నుంచి 15 అక్రమ మద్యం బాటిల్స్‌ను స్వాధీన పరుచుకున్నట్లు మంగళవారం ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. చిలమకూరు గ్రామానికి చెందిన దేవదానం, పోట్లదుర్తి గ్రామ నివాసి అయిన పెద్ద బ్రహ్మం ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకునేందుకు తీసుకెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.