కడప జిల్లా, సీతారామపురం వాసి ఉప్పలూరు గురుశేఖర్‌రెడ్డి (42) మంగళవారం ట్రాక్టర్ ట్రాలీ కిందపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గురుశేఖర్‌రెడ్డికి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండెకరాల్లో పసుపు పం ట సాగు చేశారు. మూడు రోజులుగా పసుపును ట్రాక్టర్‌తో దున్నిస్తున్నాడు. కొందరు కూలీలు పసు పు కొమ్మలను విరుస్తున్నారు. ఈకొమ్మలను పక్క న మరోచోట పోసేందుకు ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం పసుపు కొమ్మలను రాశిగా పోసేందుకు ట్రాలీని దింపాడు. లిఫ్ట్ పనిచేయక పోవడంతో ఆయన ట్రాలీ కిందకు వెళ్లి లిఫ్ట్ ఆయిల్‌పైపును గట్టిగా లాగాడు. ఒక్కసారి ట్రాలీ ఊడి పడడంతో గురుశేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa