బంధువుల ఇంటిలో ఓ ముసలావిడ బుధవారం ఉదయం మృతి చెందింది. చివరి చూపు చూడడానికి ఒకే కుటుంబ సభ్యులు పేపర్ వ్యాన్ లో బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు. కళ్యాణదుర్గం మండలం పులికల్లు గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ నిజాముద్దీన్ తో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతపురం తరలించారు. కణేకల్ మండలం అధిగానిపల్లికి చెందిన ఓ కుటుంబం వారి బంధువుల ఇంట్లో ఓ ముసలావిడ మృతి చెందిన విషయం తెలుసుకొని కళ్యాణదుర్గం మండలం కోడిపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న పేపర్ వ్యాన్ పులికల్లు గేటు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించిపోయి బస్సు షెల్టర్ కి ఢీకొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa