ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతి ప్రాణం తీసి తర్వాత యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:49 PM

కడప జిల్లా, ప్రొదుటూరు మండలం పెద్దశెట్టిపల్లెకు చెందిన ఓ జంట హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో విగతజీవులై కనిపించారు. యువకుడు గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా యువతి మంచంపై అచేతనంగా పడి ఉంది. యువతి ప్రాణం తీసిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సైఫాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దశెట్టిపల్లె వాసి బరకం ప్రసన్నలక్ష్మి (27), కానపల్లికి చెందిన హేమాంబదరెడ్డి (37) ఈ నెల 10న (శుక్రవారం) లక్డీకాపూల్‌లోని ఓ లాడ్జిలో దిగారు. లాడ్టి నియమాల ప్రకారం 24 గంటల చెకౌట్‌ సమయానికి డబ్బు చెల్లించి మరో రోజుకు గదిని అద్దెకు తీసుకోవా లి. అయితే, సోమవారం రాత్రి చెకౌట్‌ సమయం దాటిన తర్వాత లాడ్జి సిబ్బంది వారున్న గదికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో రాత్రి 10 గంటలకు మారు తాళం చెవితో సిబ్బం ది గదిని తెరవగా ఇద్దరూ లోపలే ఉన్నారు. అయితే, కాస్త సమయం ఇస్తే డబ్బు చెల్లిస్తానని హేమాంబదరెడ్డి చెప్పడంతో సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల తర్వాత మరోసారి ఫోన్‌ చేసినా బదులు రాకపోవడంతో సిబ్బంది వదిలేశారు. మంగళవారం ఉదయం కూడా స్పందన లేకపోవడంతో సిబ్బంది మరోసారి గదిని తెరిచి చూడగా.. ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రసన్నలక్ష్మి మంచంపై పడి ఉండగా హేమాంబదరెడ్డి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. సోమవారం రాత్రి పది గంటలకు ప్రసన్నలక్మి లగేజీతో గది బయటికి వచ్చినట్టు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించా రు. అయితే, ఆమె మెడకు గాయాలుండటంతో.. ప్రసన్నలక్ష్మిని హత్య చేసిన తర్వాత హేమం బద ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుల ఆధార్‌ ఆధారంగా గుర్తింపు వివరాలు సేకరించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌ అయిన ప్రసన్న లక్ష్మి స్కూల్‌ పనిపై గుంటూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్టు తెలిసింది. ఇద్దరి కుటుంబసభ్యులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa