ఓ మహిళా పోలీసును ఆకతాయి వేధించిన ఘటన ముంబైలో జరిగింది. ముంబై లోకల్ రైలులో ఓ ఆకతాయి ప్రమాదకరంగా ఫుట్ బోర్డుపైనే కూర్చున్నాడు. బాద్రా స్టేషన్ లో ఓ మహిళా పోలీసును ఉద్దేశించి ‘మేడం చాలా క్యూట్ గా ఉన్నావ్’ అంటూ టీజ్ చేశాడు. ఆపై కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నిందితుడు కావాలనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ‘జీవధార సంఘ్’ అనే ఎన్జీవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం కార్యాలయం, ముంబై పోలీసులకు వీడియో ట్యాగ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa