యంఆర్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైకె విశ్వనాథ్ మాదిగల సంగ్రామ పాదయాత్ర కర్నూలు జిల్లా ముగించుకొని కడప జిల్లా దువ్వూరు మండలం లోకి ప్రవేశించింది. ఈ శుభ సందర్భంలో బుధవారం కాజీపేట మండల యంఆర్పియస్ ఇంచార్జి వెంకటరమణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై. కె విశ్వనాథ్ కు పూల మాల వేసి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమం లో యంయస్పి జిల్లా నాయకులు కె. యన్ రాజు, కాజీపేట ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa