ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్, అవినాష్ రెడ్డి ఫోటోలు లేకుండా,,,వివేకా వర్ధంతి ఫ్లెక్సీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 06:12 PM

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.  ఇదిలావుంటే కడప జిల్లా పులివెందుల పట్టణంలో.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరయ్యారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫొటోలు లేకుండా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే.. అందులో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మరో చెల్లి సునీత ఫొటోలు ఉన్నాయి.


వారివే కాకుండా.. రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు కూడా ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. కానీ.. జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలు మాత్రం లేవు. దీంతో అందరూ దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అటు ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ విచారణకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యం సదరు ఫ్లెక్సీ.. చర్చనీయాంశంగా మారింది. అందులో ఎందుకు జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలు పెట్టలేదనే చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa