ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహకార సంఘాల అభివృద్ధి పాలకవర్గం పనితీరుపైనే ఆధారపడి ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 05:28 PM

సహకార సంఘాల అభివృద్ధి పాలకవర్గం పనితీరుపైనే ఆధారపడి ఉందని డిసిఎంఎస్ చైర్మన్ సల్లా సుగుణా దేవరాజ్ పేర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ కో ఆపరేటివ్ ఎడ్యుకేషన్, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్, రామదాసు సహకార శిక్షణా కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న లేబర్స్ కాంట్రాక్ట్ సహకార సంఘాల చైర్మన్లు, పాలకవర్గ సభ్యుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉత్తమ సహకార సంఘాలను సందర్శించారు. స్థానిక డిసిఎంఎస్ ను సందర్శించిన బృందానికి సంస్థ చైర్మన్ సల్లా సుగుణా దేవరాజ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, బిజినెస్ మేనేజర్ లక్ష్మణరావు స్వాగతం పలికి సంఘ బలోపేతానికి, ఆర్ధిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుగుణా దేవరాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి నాయకత్వ అభివృద్ధి ముఖ్యమని, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు పాలకవర్గానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్ర సహకార యూనియన్ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, లేబర్స్ కాంట్రాక్ట్ సహకార సంఘాల చైర్మన్లు, పాలకవర్గానికి మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో జిల్లాలో పలు సంఘాల పాలకవర్గ సభ్యులు పాల్గొని విజయవంతం చేసారని తెలిపారు.


సంఘాల పనితీరును మెరుగుపరుచుకునేందుకు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు పొందారని చెప్పారు. అదేవిధంగా శనివారం నుండి స్థానిక ఎన్జీవో హోంలో మూడు రోజుల పాటు మత్స్యకార సహకార సంఘాల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు నాయకత్వ అభివృద్ధిపై శిక్షణనివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని మత్యకార సహకార సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని, వారి సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామదాసు సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్, డిసిసిబి పాలకమండలి సభ్యుడు బొడ్డేపల్లి నారాయణరావు, డివిజినల్ సహకార అధికారి కె. దామోదర్, సబ్ డివిజినల్ సహకార అధికారి ఎస్. భూషణరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పూజారి జానకీరాం, ఎం. శ్రీనివాసరావు, పి. శ్రావణి, ఎఫ్. పద్మ, ఎం. జయ, జి. అరుణకుమారి, జి. వి. రమణమూర్తి, సహకార శాఖ సిబ్బంది, జిల్లాలోని వివిధ లేబర్స్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa