భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ XBB.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం తెలిపింది. ఇటీవల దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. దీనివల్ల దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయంది. ఈ కేసులు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఒడిశాలో ఉన్నాయి. దీని వ్యాప్తితో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముండొచ్చు.