బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం తెల్లవారు జాము నుంచి విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. పలు రహదారులు జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో విశాఖలో వాన దంచికొడుతోంది. గాజువాక , పెందుర్తి, సబ్బవరం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, మద్దిలపాలెం, సిరిపురం, డాబాగార్డెన్స్. అల్లిపురం, రైల్వేస్టేషన్, భీమిలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం, సోమవారం వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa