రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి మరో రూ.1760 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ అప్పు తెచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి తీసుకొచ్చే ఆఖరు అప్పు ఇదే. ఇప్పటివరకు ఆర్‌బీఐలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ.57,478 కోట్ల అప్పు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఈ విషయం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa