ఈ రోజుల్లో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా కంటి చూపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బాదం పప్పును ఉదయం పూట తినడం వల్ల కళ్లను సంరక్షిస్తుంది. ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. కంటి చూపు మెరుగు పడాలంటే రోజూ ఆహారంలో 50 గ్రాముల మేర పచ్చి ఉల్లిపాయలను తింటుండాలి.