ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రేగిడి ఆమదాలవలస మండలంలోని బొడ్డవలస, తునివాడా, రేగిడి, కొమిరి వెంకటాపురం గ్రామాల కేంద్రాలుగా నాగావళి నది పరివాహ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో నాగావళి నదిలో ఇసుకను ట్రాక్టర్లతో రాజాము, చీపురుపల్లి, విజయనగరం తదితర పట్టణాలకు తరలించి అధిక ధరలకు విక్రయాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో మరి విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినా, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరి కొంతమంది ఎడ్ల బల్లల్లో తీసుకుని తెచ్చి తోటల్లోనూ, పంటపొలాల్లోనూ డంపింగ్ చేసి రాత్రిపూట ట్రాక్టర్ లలో, లారీలతో ఇసుకను పట్టణాలకు తరలించి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. ఇసుక ఆక్రమ రవాణాకు అడ్డుకట్ట లేదని పలు గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.